లాల్‌సింగ్ చద్దా..విజయశాంతి కామెంట్స్ వైరల్!

26
vijyashanthi
- Advertisement -

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్‌, కరీనా కపూర్‌, నాగ చైతన్య నటిస్తున్న చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ‘ఫారెస్ట్‌ గంప్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కగా ఆగస్టు 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో అమీర్ ఖాన్ ఇండియాలో ఉండాలంటే రక్షణ లేదు, ఇక్కడ బతకాలంటే భయం వేస్తుంది అని కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని ట్రోల్ చేస్తూ ఇక్కడ రక్షణ లేదు అనేవాడివి ఇక్కడ సినిమా ఎందుకు రిలీజ్ చేస్తున్నావు? పాకిస్థాన్, ఆఫ్గనిస్తాన్ వెళ్ళు అని కామెంట్స్ చేస్తూ లాల్ సింగ్ చడ్డాని బాయ్‌కాట్‌ చేయమని ట్రెండింగ్ చేస్తున్నారు.

దీనిపై స్పందించారు విజయశాంతి. ప్రజల్ని అమాయకులుగా భావించి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్ కి జనం అర్థమయ్యేలా చేస్తున్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేట్ వ్యవస్థల్లో హైందవేతరులు ఎన్నెన్ని గొప్ప గొప్ప స్థానాల్ని పొందారో, ఇప్పటికీ పొందుతున్నారో, చరిత్రను, సమకాలీన పరిస్థితుల్ని పరిశీలిస్తే తెలుస్తుందని తెలిపారు. దేశం పట్ల ప్రజల్లో ఉన్న ప్రేమాభిమానాలను పట్టించుకోకుండా వ్యవహరించడం సమంజసం కాదు అని తెలిపారు విజయశాంతి.

- Advertisement -