రవితేజ 69 @ ధమాకా

68
raviteja

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రవితేజ కెరీర్‌లో 69వ సినిమా కాగా దసరా కానుకగా సినిమా టైటిల్‌ని ప్రకటించారు. ఈ చిత్రానికి ‘ధమాకా’ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. భీమ్స్ సంగీతం సమకూరుస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2022లో ‘ధమాకా’ థియేట్రికల్ విడుదలతో ప్రేక్షకులను అలరించనుంది.