నాని ‘దసరా’ ఫస్ట్ లుక్

59
nani

రిలీజ్‌తో సంబంధంలేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు నాని. ఇటీవలె టక్ జగదీష్‌ సినిమాతో ఆకట్టుకున్న నాని… ‘శ్యామ్ సింగ రాయ్’, ‘అంటే సుందరానికి’ వంటి చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇక దసరా సందర్భంగా నాని 29వ సినిమా టైటిల్ లుక్ రిలీజ్‌ అయింది.

ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతుండగా ‘దసరా’ ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. బ్యాక్‌డ్రాప్‌లో ‘బతుకమ్మ’ పాటతో ప్రారంభమైన ఈ వీడియోలో నాని చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ప్రేక్షకుల్లో ‘దసరా’ పండగ జోష్ ను పెంచేసింది.

సినిమా కథ గోదావరిఖనిలోని సింగరేణి బొగ్గు గనులలో ఉన్న ఒక గ్రామంలో జరుగుతుంది. ‘దసరా’ సినిమాను సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో తెరకెక్కిస్తుండగా, జాతీయ అవార్డు గెలుచుకున్ననటి కీర్తి సురేష్ నానితో స్క్రీన్ స్పేస్ పంచుకోనుంది. సాయి కుమార్, సముద్రకని, జరీనా వహబ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Siren Of Dasara | Nani, Keerthy Suresh | Srikanth Odela | Sudhakar Cherukuri