బ్రిటన్ ఎంపీ దారుణ హత్య..

88
britan

బ్రిటన్‌ ఎంపీ డేవిడ్‌ అమీస్‌ దారుణ హత్యకు గురయ్యారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఎంపీ డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరుకాగా ఓ వ్యక్తి ఆయనపై విచక్షణా రహితంగా దాడి చేశాడు.

దీంతో తీవ్ర గాయాల పాలైన ఆయనను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.