రవీంద్ర కౌశిక్‌…ది బ్లాక్ టైగర్‌ బయోపిక్

76
- Advertisement -

సినిమాలో నటులు నటిస్తారు కానీ మరికొంత మంది నిజజీవితంలో మాత్రమే నటిస్తారు. అలాంటి వారిలో రవీంద్ర కౌశిక్ ఒకరు.  ఈయన హర్యానాలో 1952, ఏప్రిల్‌11న జన్మించి…పాకిస్థాన్‌లో గూఢచారిగా పనిచేశారు. ఇండియాలో పుట్టి పాక్‌లో నటించిన ఒక అద్భుతమైన నటుడు…ఎందుకంటే దేశం కోసం జీవించిన వ్యక్తిగా నిలిచారు.

తాజాగా బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు రవీంద్ర కౌశిక్ జీవితంలో జరిగిన సంఘటనలను ది బ్లాక్ టైగర్ పేరుతో తెరకెక్కించనున్నారు. పలువురి ప్రముఖుల బయోపిక్ సినిమాలు వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచాయి. తాజా నిర్ణయంతో బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ కావడం ఖాయమని పలువురు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పాకిస్థాన్‌లో ఏజంట్‌గా పనిచేసిన రవీంద్ర కౌశిక్ బయోపిక్‌ రూపొందిస్తున్నట్టుగా ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రవీంద్ర కౌశిక్ ధైర్యానికి పరాక్రమానికి నిలువెత్తు నిదర్శనం. 20యేళ్ల వయసులోనే దేశం కోసం ఎన్నో సాహసాలు చేశారని అన్నారు. జాతీయ అంతర్జాతీయ భద్రతా విషయాల్లో కీలకపాత్ర పోషించారు.

ఇలాంటి వాళ్లు మన చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వారి నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా ఎవరు కనిపిస్తారన్నది ఆసక్తిగా రేపుతోంది. గూఢచర్యం చేస్తున్న సందర్భంలో పాకిస్థాన్‌కు దొరికిపోయి జైలు శిక్ష అనభవించి వీరమరణం పొందారు.

ఇవి కూడా చదవండి…

శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్‌ బయోగ్రఫీ

కృతి పాప టెంప్టింగ్ ఫోజులు

లియోలో టాలీవుడ్ టాప్ హీరో..!

- Advertisement -