శ్రీదేవి..ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్‌ బయోగ్రఫీ

84
- Advertisement -

అతిలోక సుందరి శ్రీదేవి…బాలనటిగా సినీ జీవితం మొదలుపెట్టి భారతదేశంలో అగ్రతారగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తన నటన కౌశలంతో ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకున్న శ్రీదేవి బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు బోనీకపూర్‌ పెళ్లి చేసుకొని సినిమాలకు విరామం తీసుకుంది. శ్రీదేవి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రానుంది. ప్రముఖ పరిశోధకుడు రచయిత ధీరజ్ కుమార్‌ శ్రీదేవి బయోగ్రఫీని ది లైఫ్ ఆఫ్ ఎ లెజెండ్ అనే పేరుతో రచించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నా తొలి బయోగ్రఫీ అని అన్నారు. దీనిని రాయడానికి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌, ఆమె కుమార్తెలు జాన్వీ ఖుషీ కపూర్‌లు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీదేవి సెకండ్ ఇన్నింగ్స్లో తీసిన ఇంగ్లీష్‌ వింగ్లీష్ సినిమాను చైనాలో ఐదో వర్థంతి సందర్భంగా ఈ నెల 24న విడుదల చేయనున్నారు. ఎన్నో అద్భుతమైన సినిమాలతో అలరించిన శ్రీదేవి 2018ఫిబ్రవరి 24న మరణించిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

కృతి పాప టెంప్టింగ్ ఫోజులు

లియోలో టాలీవుడ్ టాప్ హీరో..!

ఎన్టీఆర్ తో విక్రమ్ ఖరారు

- Advertisement -