టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సొగ్గాడే చిన్ని నాయన బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. దీనికి సీక్వెల్గా నాగ్ హీరోగా బంగర్రాజు తెరకెక్కనుందని చిత్ర దర్శకుడు ప్రకటించాడు. అయితే ఈ చిత్రంలో నాగార్జునకి బదులు ‘మాస్ మహారాజ్’ రవితేజ ఫైనల్ అయ్యాడని టాక్. బంగార్రాజు ..నాగ్ కోసమేనని ప్రకటించిన కల్యాణ్ కృష్ణ తన మనసు మార్చుకున్నాడట.
ఇప్పటికే రవితేజ కు కథ వినిపించడం జరిగిందట. కథ బాగా నచ్చడం తో రవితేజ వెంటనే కళ్యాణ్ కృష్ణ కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన రవితేజ ప్రస్తుతం విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టచ్ చేసి చూడు’ లో హీరోగా నటిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే కళ్యాణ్ కృష్ణ మూవీ మొదలు పెట్టె అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటివరకు ఫ్యామిలీ కథలతో ఆకట్టుకున్న కళ్యాణ్ కృష్ణ , రవితేజ తో ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి.