సూర్య …’గ్యాంగ్‌’లో మహానటి

220
Suriya..Keerthy Suresh movie titled Gang.
- Advertisement -

తమిళ నటుడు సూర్య హీరోగా విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తానా సెరింద కొట్టం’. తెలుగులో గ్యాంగ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో మహానటి ఫేమ్‌ కీర్తి సురేష్‌ హీరోయిన్‌గా నటించనుంది.

ప్రతియేటా సంక్రాంతి పోటీ అత్యంత ఆసక్తిదాయకంగా నిలుస్తూ వస్తోంది. దీనికి వచ్చే సంక్రాంతి కూడా మినహాయింపులా కనిపించడం లేదు. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇరవై ఐదో సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుండగా, బాలయ్య జై సింహా, రవితేజ టచ్ చేసి చూడు, రజనీకాంత్ కాలాలు కూడా సంక్రాంతి విడుదలకు షెడ్యూల్ అయ్యాయి.

Suriya..Keerthy Suresh movie titled Gang.
వీటితో పాటు విశాల్ అభిమన్యుడు, రాజ్ తరుణ్ రాజుగాడు వంటి సినిమాలు కూడా సంక్రాంతి రేసులో ఉన్నాయి. తాజాగా సూర్య కూడా సంక్రాంతి రేసులో నిలిచాడు. జనవరి 12న విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. తమిళ, తెలుగు వెర్షన్లు అదే రోజున విడుదల కానున్నాయట. ఈ సినిమాను తెలుగునాట యూవీ క్రియేషన్స్ విడుదల చేస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి భారీ సినిమాలతో బాక్సాఫీసు కళకళలాడనుంది.

- Advertisement -