త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ 69

52
rt

వరుస సినిమాలతో దూసుకుపోతున్న హీరో రవితేజ తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వలో సినిమా చేయనుండగా ఈ సినిమా షూటింగ్ అక్టోబ‌ర్ 4 నుండి ప్రారంభంకానుంది. రవితేజ కెరీర్‌లో ఇది 69వ సినిమా కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు.

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ అనే సినిమా చేస్తున్నారు రవితేజ. సస్పెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో రవితేజ డబుల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే పూర్తి కాగా, త్వ‌ర‌లో రిలీజ్ డేట్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు.

దీంతో శరత్ మందవా అనే దర్శకుడితో ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే చిత్రాన్ని చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవడానికి వచ్చాయి. మొత్తంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు రవితేజ.