హుజురాబాద్…టీఆర్ఎస్‌లో కొనసాగుతున్న చేరికలు

34
trs

హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుతుండగా వివిధ వర్గాలకు చెందిన యువకులు పెద్ద ఎత్తున టీఆర్ఎస్‌లో చేరుతున్నారు.

హుజూరాబాద్ ప‌ట్ట‌ణానికి చెందిన వంద మంది యువ‌కులు మంత్రి గంగుల స‌మ‌క్షంలో టీఆర్ఎస్ కండువా క‌ప్పుకున్నారు. పార్టీ కార్యాలయంలో యువ‌కుల‌కు సాద‌ర‌స్వాగ‌తం ప‌లికారు మంత్రి గంగుల. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో యువ‌త‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు. యువ‌కులు ఉరిమే ఉత్సాహంతో పార్టీ అభివృద్ధికి కృషి చేయాల‌ని ఆకాంక్షించారు.