సంక్రాంతి రేసులో రవితేజ…క్రాక్!

60
krack

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని రూపొందిస్తోన్న సినిమా ‘క్రాక్‌’. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం టాకీ పార్ట్ ఇప్పటికే పూర్తయింది.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్‌డేట్ వచ్చేసింది. సముద్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్‌, దేవీప్రసాద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేయబోతున్న‌ట్టు మేక‌ర్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌కటించారు.

క్రాక్ చిత్రంలో ర‌వితేజ పవ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌నుండగా ఇటీవలె విడుదల చేసిన భలేగా తగిలావ్‌ బంగారం అనే లిరికల్‌ వీడిమోకి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అనిరుధ్ ఆల‌పించిన ఈ గీతానికి రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించగా తమన్‌ బాణీలను సమకూర్చారు.