పేకమేడలా కూలిన కోహ్లీ సేన…

95
ind

ఆడిలైడ్ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ …రెండో ఇన్నింగ్స్‌లో అనూహ్యంగా 36 పరుగులకే చాపచుట్టేసింది.

ఆసీస్ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో విరుచుకపడటంతో భారత బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఒక్కరంటే ఒక్కరు రెండంకెల స్కోరు చేయలేక పోయారు. ఓపెన‌ర్లు పృధ్వీ షా(4), మ‌యాంగ్ అగ‌ర్వాల్(9)‌, పుజారా(0), కోహ్లీ(4), ర‌హానే(0)లు అంద‌రూ విఫలమయ్యారు.

మూడోరోజు తొలి సెష‌న్‌లో కేవ‌లం 30 ప‌రుగుల‌కే ఇండియా 8 వికెట్ల‌ను కోల్పోయింది. షమీ రిటైర్‌ హార్ట్‌ కావడంతో భారత్ 9 వికెట్లు కొల్పోయి 36 పరుగులు చేసింది.