టీవీ9 హోల్ టైమ్ డైరెక్టర్ గా రవి ప్రకాష్‌ తొలగింపు:సాంబశివరావు

439
tv 9
- Advertisement -

టీవీ9లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీవీ 9 హోల్ టైమ్ డైరెక్టర్ పదవి నుండి రవిప్రకాష్‌ను తొలగిస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. అలందా మీడియా టీవీ9లో 90.5 శాతం షెర్లు కలిగి ఉందని చెప్పిన సాంబశివరావు ఇవాళ ఈజీఎం మీటింగ్ నిర్వహించి టీవీ 9 కన్నడ హెడ్ మిశ్రాను తాత్కాలిక సీఈవోగా నియమిస్తున్నట్లు తెలిపారు.సింగారావును సీవోవోగా నియమిస్తున్నట్లు తెలిపారు.

టీవీ 9 టేకోవర్ తర్వాత మాకు చాలా అవరోధకల్పించేందుకు రవిప్రకాష్‌ ప్రయత్నించారని సాంబశివరావు తెలిపారు. ప్రస్తుతం బోర్డులో నలుగురు డైరెక్టర్లు ఉన్నారని చెప్పారు. మార్చిలో మాకు కేంద్రం నుండి అనుమతి వచ్చిందన్నారు. జర్నలిజం ప్రమాణాలు పెంచడమే తమ ఉద్దేశమని వెల్లడించారు.

ఏబీసీఎల్‌గాను టీవీ9 కంటిన్యూ అవుతుందని అలంద షేర్లు మాత్రమే కలిగిఉందన్నారు. రవిప్రకాష్ షేర్ హోల్డర్ మీటింగ్‌లకు హాజరుకావచ్చని చెప్పారు. టీవీ 9 అన్ని లాంగ్వేజ్ ఛానల్స్‌ను అలంద టేకోవర్ చేసిందన్నారు. టీవీ9 ఉద్యోగులు ఎలాంటి భయాందోళనకు గురికావొద్దన్నారు. ఇవాళ షేర్ హోల్డర్స్ మీటింగ్ కూడా జరిగిందని వారందరికి రవి ప్రకాష్‌ను తొలగిస్తున్నట్లు చెప్పామని తెలిపారు.

- Advertisement -