రవితేజ ‘రావణాసుర’ కోసం చిరు వస్తున్నాడు..

27

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతోన్న చిత్రం ‘రావణాసుర’. రవితేజ 70వ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్లు ప్రకటించారు.

ఈ సినిమాను, ఈ నెల 14వ తేదీన లాంచ్ చేయనున్నట్టు కొన్ని రోజుల క్రితమే తెలియజేశారు. తాజాగా ఈ కార్యక్రమం ఎప్పుడు మొదలుకానుందనే విషయాన్ని ప్రకటించారు. రేపు ఉదయం 9:51 నిమిషాలకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అంతేకాదు ఈ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రాబోతున్నట్లుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించింది.