రావణాసుర..అలరిస్తుంది

60
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ క్రైమ్ యాక్షన్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్‌వర్క్స్‌పై అభిషేక్ నామా, రవితేజ గ్రాండ్ గా నిర్మించారు. హీరో సుశాంత్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే భారీ అంచనాలని నెలకొల్పింది. హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో ద్వయం సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ఏప్రిల్ 7న సమ్మర్ స్పెషల్ గా సినిమా రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో దర్శకుడు సుధీర్ వర్మ రావణాసుర విశేషాలని విలేకరులు సమావేశంలో పంచుకున్నారు.

‘రావణాసుర’ కథ గురించి టీమ్ లో ఎవరిని అడిగినా ఏప్రిల్ 7 తర్వాతే అంటున్నారు ? అసలు ‘రావణాసుర’ ఎలా వుంటుంది ?

‘రావణాసుర’ సూపర్ ఎక్సయిటెడ్ గా వుంటుంది. సినిమాలో థ్రిల్స్, షాకింగ్ ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణగా వుంటాయి. అందులో ఏది రివిల్ చేసినా సినిమా చూసినప్పుడు ఆ థ్రిల్ వుండదు. ప్రేక్షకుడికి థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వడానికే దానిని హోల్డ్ చేస్తున్నాం.

రవితేజ గారితో థ్రిల్లర్ జోనర్ సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చింది ?

రవితేజ గారికి ఫలానా జోనర్ సినిమా చేయాలని ముందుగా ఏమీ అనుకోలేదు. అయితే శ్రీకాంత్ కథ చెప్పిన్నపుడు రవితేజ గారికి నచ్చి, నేనైతే బావుంటుదని నా దగ్గరికి పంపించారు. కథ విన్నప్పుడు నాకు ఎక్సయిటింగా అనిపించింది. ఇలాంటి థ్రిల్లర్ ని ఓ పెద్ద హీరో చేయడం ఇంకా ఎక్సయిటెడ్ గా అనిపించింది. రావణాసుర వంద శాతం కొత్త జోనర్ మూవీ. ఇలాంటి కథ ఇప్పటివరకూ తెలుగులో రాలేదు. సినిమాపై చాలా నమ్మకంగా వున్నాం.

స్టయిలీష్ మేకర్ గా మీకు మంచి పేరుంది. రవితేజ గారు మిమ్మల్ని ఎంపిక చేయడానికి కారణం కూడా అదే అనుకోవచ్చా ?

ఒక కథని ఎలా తీయాలనేది.. డైరెక్టర్ టేక్. స్టయిలీష్ గా వున్న సినిమాలు మాస్ గా కూడా తీయొచ్చు. నా వరకూ ఇది మాస్ గా తీయాలి, ఇది స్టయిలీష్ గా తీయాలని ఏమీ వుండదు. కథని బట్టి టేక్ వుంటుంది.

తెలుగు సినిమాల్లో ఒక హ్యాపీ ఎండింగ్, హీరో పాజిటివ్ షెడ్ వుంటుంది కదా.. కానీ ఇందులో మీరు ఫ్లిప్ చేసినట్లుగా వున్నారు?

మీరు మళ్ళీ కథలోకి వెళ్తున్నారు. (నవ్వుతూ) మీరు అన్నట్టుగా ఆ ఫ్లిప్ ఏమిటనేది మీరు వంద శాతం తృప్తి పడతారు. సినిమా చూసిన తర్వాత మన సెన్సిబిలిటీస్ మిస్ అయిన ఫీలింగ్ మీకు రాదని నా నమ్మకం.

పుష్ప, కేజీఎఫ్.. ఇలా గత రెండేళ్ళుగా హీరోలని గ్రే షేడ్స్ లో చూపించడం ట్రెండ్ గా మారింది కదా ?

గ్రే షేడ్స్ అనేది చాలా కాలంగా వుంది. అంతంలో నాగార్జున, సత్యలో జేడీ ఇవన్నీ గ్రేనే కదా. ఇవి ఎప్పటి నుంచో వున్నాయి. అయితే ఈ మద్య అవి ఎక్కువగా పెరిగాయి.

ఇందులో చాలా మంది నటీనటులు వున్నారు కదా.. ప్యాడింగ్ బరువైనట్లు అనిపించలేదా ?

కథలో ఇంతమంది వున్నారు .. ఏం చేస్తారు ? అనే క్యురియాసిటీనే కావాలి . చూసినపుడు మీకు అర్ధమౌతుంది. ప్రతి పాత్ర కీలకంగా కథలో భాగంగా వుంటుంది. సర్ ప్రైజ్, షాక్, థ్రిల్లు ఈ మూడు ఎలిమెంట్స్ తో అలరించే చిత్రమిది.

రావణాసుర పాత్ర మణిరత్నం గారి రావణ్ ని గుర్తు చేస్తుంది ?

మణిరత్నం గారు ఎగ్జాట్ గా రామాయణం తీశారు. అయితే ఇందులో నా హీరో పాత్రకి రావణాసుర పేరు సరిగ్గా నప్పుతుంది. అలా అని నేను రామాయణంలోకి వెళ్ళలేదు. అయితే రావణాసుర అనే పేరు పెట్టిన తర్వాత దానికి తగ్గట్టు కొన్ని డైలాగులు యాప్ట్ అయ్యాయి, కొన్ని వాడుకున్నాం తప్ప రామాయణంతో సంబంధం లేదు.

రావణాసుర కి సీక్వెల్ ఛాన్స్ ఉందా ?

ఈ కథకి ఒక ముగింపు వుంటుంది. అయితే సీక్వెల్ చేయాలని అనుకున్నపుడు ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళే అవకాశం కూడా వుంది.

వేరే రచయిత కథని డైరెక్ట్ చేయడం ఎలా వుంటుంది ?

ఖచ్చితంగా ఒక సవాల్ వుంటుంది. నా కథ అయితే నా విజువల్ సెన్సిబిలిటీకి తగట్టు రాసుకుంటాను. ఏదైనా మార్పు చేయడం కూడా సులువుగా వుంటుంది. వేరే కథలో మార్పు చేసినప్పుడు ఆ మార్పు మిగతా ఏరియాల్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందనేది రచయితతో కూర్చుని క్రాస్ చెక్ చేసుకోవాలి.

రవితేజ గారి పెర్ఫార్మన్స్ గురించి ?

రవితేజ గారి పెర్ఫార్మన్స్ గురించి మనందరికీ తెలుసు. నా విజన్ కి బెటర్ గానే ఆయన పెర్ఫార్మన్స్ చేస్తారు. ఇది కంప్లీట్ రవితేజ గారి సినిమా. పెర్ఫార్మన్స్ వారిగా ఆయన సినిమాల్లో టాప్ 3 లో వుంటుంది.

మీరు ఎక్కువగా థ్రిల్లర్స్ చేయడానికి కారణం ?

నాకు క్రైమ్ జోనర్ మీద సినిమా రన్ చేయడం ఇష్టం. నాకు హోల్డింగ్ పాయింట్ కావాలి. తర్వాత ఏం జరుగుతుందని ఆడియన్ ఆసక్తిగా ఎదురుచూసేలా చేయడం నాకు బాగా ఇష్టం.

రవితేజ గారు ధమాకా, వాల్తేరు వీరయ్య వరుస విజయాలతో వున్నారు. ఇప్పుడు రావణాసుర వస్తోంది. ఈ విషయంలో మీపై ఒత్తిడి ఉందా ?

నా సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ ఇవ్వాలనే టెన్షన్ వుంటుంది.

రావణాసుర మ్యూజిక్ సూపర్ హిట్ అయ్యింది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి ?

సినిమా ప్రారంభంలోనే హర్షవర్ధన్ తో నేపధ్యం సంగీతం, భీమ్స్ తో పాటలు చేయించాలని అనుకున్నాం. హర్ష రావణాసుర టైటిల్ సాంగ్ చేశాడు. చాలా బాగా వచ్చింది. తర్వాత రిమిక్స్ పాట కూడా బాగా చేశాడు. భీమ్స్ డిక్కా డిష్యు పాట చేశారు.

అభిషేక్ గారితో పని చేయడం గురించి ?

అభిషేక్ గారితో నాకు ఇది రెండో సినిమా. నేను ఉన్నంత వరకూ ఆయన అన్ని వదిలేస్తారు. ‘’సుధీర్ ఏం అడిగితే అది ఇచ్చేయండి’’ అని చెప్తారు.

థ్రిల్లర్స్ కి యునివర్షల్ రీచ్ వుంటుంది కదా.. రావణాసురని అన్ని భాషల్లో విడుదల చేయాలనే ఆలోచన రాలేదా ?

ముందు అనుకున్నాం. హిందీ , తమిళ్ లో విడుదల చేయాలని అనుకున్నాం. కానీ వాళ్ళకి పదిహేను రోజులు ముందు కాపీ పంపించాలి. అయితే మేము ఏదైతే దాస్తూ వచ్చామో ఆ ఎలిమెంట్స్ బయటికి వచ్చేస్తాయనే భయంతో ముందు తెలుగులోనే విడుదల చేయాలని అనుకున్నాం. సెకండ్ వీక్ నుంచి హిందీ ప్లాన్ చేస్తున్నాం.

ఎవరికీ రివిల్ చేయకూడదు, ఇంత సీక్రెట్ గా వుంచాలని అనుకోవడం కూడా రిస్కే కదా ?

అన్ని సినిమాలు ఒకేలా చేస్తున్నారని అంటారు. కొత్తగా చేస్తే ఎందుకు ఇలాంటి రిస్క్ అని మీరే అంటారు (నవ్వుతూ). ఇది రిస్కే. అయితే ఎప్పుడైతే కథ విన్న తర్వాత ఒక ఎక్సయిట్ మెంట్ వచ్చిందో ఆడియన్స్ కి కూడా ఆ ఎక్సయిట్మెంట్ ని ఇవ్వాలని అనుకున్నాం.

పవన్ కళ్యాణ్ గారితో సినిమా గురించి ?

అది త్రివిక్రమ్ గారి కథతో వుంటుంది. అయితే అది ఎప్పుడు ఏంటి అనేది త్వరలో తెలుస్తుంది.

- Advertisement -