కరోనాకు మందు లేదు.. అప్రమత్తంగా ఉండాలి..

206
corona
- Advertisement -

నిజామాబాద్ జిల్లాలో పోచారం చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోటగిరి మండల కేంద్రంలో నిరుపేద బ్రాహ్మమనులకు,క్రిస్టియన్ లకు,ఈమామ్ లకు,ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు, మునిసిపాలిటీ సిబ్బందికి, పోలీస్ కానిస్టేబుల్ లకు,హోంగార్డులకు 25 కిలోల ఉచిత బియ్యని, నిత్యావసర వస్తువులను బాన్సువాడ టీఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పోచారం సురేందర్ రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా మహమ్మారిని రూపుమాపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పగడ్బందీ చర్యలను చేపడుతున్నారు.కరోనా కట్టడికి ముఖ్యమంత్రి చేపడుతున్న చర్యలతో దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.ప్రజలంతా లాక్ డౌన్‌కు సహాయ సహకారాలు అందించి,స్వీయ నియంత్రణలను పాటించాలి.కరోనా కు మందు దొరికేంతవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. అత్యవసర పనులు ఉంటే తప్ప బయటకు రావద్దని కోరారు.

- Advertisement -