రష్మికా….పొగరు అప్ డేట్

365
rashmika

రష్మిక మందన్నా…ప్రస్తుతం టాలీవుడ్ మొత్తం ఈ భామ జపమే చేస్తోంది. ఛలో సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ గీతా గోవిందం మూవీతో అగ్ర హీరోయిన్‌ జాబితాలో చేరిపోయింది. తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోన్న రష్మిక ముఖ్యంగా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించేసింది. ప్రస్తుతం మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు,నితిన్‌తో భీష్మ మూవీతో పాటు కోలీవుడ్‌లో కార్తికి జోడీగా ఓ చిత్రంలో నటిస్తోంది.

ఈ సినిమాలతో పాటు మాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ హీరోగా నందకిషోర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొగరు చిత్రంలో నటిస్తోంది. జగద్గురు మూవీస్ బ్యానర్‌పై బికే గంగాధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా లాంగ్ షెడ్యూల్‌లో భాగంగా రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే తాజాగా టీ టౌన్ అప్ డేట్స్ ప్రకారం సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం.

భైరవగీత ఫేమ్ ధనుంజయ్‌ ఈ మూవీలో విలన్‌గా నటిస్తుండగా స్పోర్ట్స్ న్యూటీష‌న్ జాన్ లుకాస్‌, జర్మ‌న్ ఫిట్‌నెస్ సెన్సేష‌న్ జో లిన్‌డ‌ర్ వంటి ఇంట‌ర్నేష‌న‌ల్ బాడీ బిల్డ‌ర్స్ ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.