27న హెచ్‌సీఏ ఎన్నికలు…

458
sampath hca elections

అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27న ఎన్నికలు జరుగుతాయని మాజీ సీఈసీ, హెచ్‌సీఏ ఎన్నికల అధికారి వీఎస్ సంపత్ ప్రకటించారు.

ఈనెల 17నుంచి 20 వరకు అర్హత గల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. 21న నామినేషన్ల స్క్రూటినీ, 23వ నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెలువరించనున్నారు.

హెచ్‌సీఏ గుర్తింపు క్రికెట్ క్లబ్‌లు, వాటి పేర్లను హైదరాబాద్ క్రికెట్ వెట్‌సైట్‌లో పొందుపరిచామని.. ఇందులో  ఏమైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈనెల 16 వరకు చేసుకోవచ్చని వెల్లడించారు. తుది జాబితా ఆధారంగా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి పదవులకు అభ్యర్థులు పోటీపడవచ్చు.