రష్మీకా న్యూ లుక్‌…వైరల్!

175
Rashmika
- Advertisement -

గీతాగోవిందం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ రష్మీకా. ఈ సినిమా తర్వాత అగ్రహీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా ఎప్పటికప్పుడు తన కొత్త ఫోటో షూట్‌తో అభిమానులను కనువిందు చేస్తూనే ఉంది.

తాజాగా పర్పుల్ డ్రాస్ట్రింగ్ సైడ్ స్ప్లిట్ డ్రెస్ లో హాట్ గా మెరిసిపోయింది. ఈ బోల్డ్ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన రష్మిక..పెద్ద పనులు చేయాలనుకుంటున్న అమ్మాయి.. చిన్నచిన్న పనులను తన చెంతకు రానివ్వదు అని ఎవరో చెప్పారు. ఇది నాకు కరెక్ట్‌గా సరిపోతుంది అంటూ ట్వీట్ చేసింది.

అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాలో నటిస్తున్న రష్మీకా.. బాలీవుడ్ లో గుడ్‌బై చిత్రంలో నటిస్తోంది. ఇందులో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మొదటి బాలీవుడ్ చిత్రం “మిషన్ మజ్ను” ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

- Advertisement -