గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు..

177
Israeli-Palestinian
- Advertisement -

మరోసారి బాంబుల మోతతో దద్దరిల్లింది పాలస్తీనాలోని గాజా. పాలస్తీనా – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజులు కాకముందే మరోసారి వైమానిక దాడులతో విరుచుక పడింది ఇజ్రాయెల్.

దక్షిణ ఇజ్రాయెల్‌లోకి పాలస్తీనియన్లు పేలుడు బెలూన్లు వదిలారని ఆరోపిస్తూ..వైమానిక దాడులకు దిగింది. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.

గత నెలలో 11 రోజుల పాటు పాలస్తీనాలోని హమాస్‌ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్‌ సైన్యం మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాకెట్​ దాడులు చేసుకున్నాయి. వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. దీంతో అంతర్జాతీయంగా తీవ్ర ఒత్తిడి రావడంతో ఇజ్రాయెల్- గాజాల మధ్య మే 21న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.

- Advertisement -