శివ కార్తికేయన్‌తో రష్మికా!

96
rashmika
- Advertisement -

ఛలో సినిమాతో వెండి తెరకు పరిచయమైన బ్యూటీ రష్మికా మందన. తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న రష్మిక…ప్రస్తుతం వెండితెర గోల్డెన్ లెగ్‌గా మారిపోయింది. గీతగోవిందం, దేవదాస్, సరిలేరు నీకెవ్వరు,భీష్మ వంటి సినిమాలతో మంచి సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం మహేశ్‌తో సర్కార్ వారి పాట,అల్లు అర్జున్‌తో పుష్ప మూవీ చేస్తున్న రష్మికా టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లో బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.

తాజాగా జాతిరత్నాలు సినిమాతో మంచి హిట్ అందుకున్న దర్శకుడు కేవీ అనుదీప్ త్వరలోనే తమిళ హీరో శివ కార్తికేయన్‌తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అనుదీప్, రష్మికకు కథ కూడా వినిపించగా దాదాపు ఓకే చెప్పేసినట్లు టాక్.

ప్రస్తుతం తెలుగులో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’, బాలీవుడ్‌లో ‘మిషన్ మంజు’, ‘గుడ్‌బై’ అనే సినిమాలతో బిజీగా ఉంది. తమిళ్‌లో కార్తీ హీరోగా వచ్చిన ‘సుల్తాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన రష్మిక.. అక్కడ కూడా మంచి సక్సెస్‌ని అందుకుంది.

- Advertisement -