రౌడీతో అఫైర్.. రష్మిక క్లారిటీ!

465
rashimika mandanna
- Advertisement -

ఛలో సినిమాతో టాలీవుడ్‌లో అడుపెట్టిన కన్నడ బ్యూటీ రష్మికా మందన్న స్టార్‌ హీరోయిన్‌గా మరిపోయింది. ఈ అమ్మడు నటించిన గీతా గోవిందం సినిమా భారీ హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన విషయం తెలిసిందే. అలాగే డియర్‌ కామ్రేడ్‌ చిత్రంలో కూడా వీరిద్దరి జోడి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రస్తుతం సూపర్ హిట్ జోడీ అంటే, తొలుత గుర్తుకు వచ్చేది విజయ్ దేవరకొండ, రష్మికాలదే అని చెప్పవచ్చు.

అయతే ఇదే సమయంలో వీరిద్దరి మధ్య ఏదో అఫైర్ నడుస్తోందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా, రష్మికను వ్యక్తిగతంగా కించపరిచేలా, విజయ్ తో అఫైర్ ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అయింది. దీన్ని చూసిన రష్మిక, సీరియస్ గా స్పందించింది. నటీ నటుల మీద ఇటువంటి విమర్శలు చేస్తే ఏమొస్తుందో తెలియడం లేదని మండిపడింది. యాక్టర్స్ అంటే సాఫ్ట్ టార్గెట్ అవుతారన్న ఉద్దేశంలో వీరున్నారని, తాను పబ్లిక్ ఫిగర్ అయినంత మాత్రాన తమను డైరెక్ట్ గా టార్గెట్ చెయ్యొచ్చని కాదని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

rashmika

నెగటివ్ కామెంట్స్ ను పట్టించుకోవద్దని తనకు చాలా మంది చెబుతుంటారని, కానీ కొన్నింటిని పట్టించుకోవాల్సిన పరిస్థితి వస్తోందని చెప్పుకొచ్చింది. సదరు పోస్ట్ ను పెట్టిన వాళ్లకు కంగ్రాట్స్‌ చెబుతూ, తనను నొప్పించాలనుకున్న వారు విజయవంతం అయ్యారని ఎద్దేవా చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడు నితిన్‌తో భీష్మ చిత్రంలో నటిస్తోంది. ఫిబ్రవరి 2020లో ఈ సినిమా విడుదల కానుంది.

- Advertisement -