రాజ్ కోట్‌లో రెచ్చిపోయిన రోహిత్..!

291
rohit sharma
- Advertisement -

రాజ్ కోట్‌లో గురువారం జరిగిన రెండో టి20 పోరులో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తు చేసింది. బంగ్లాదేశ్ విసిరిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (43 బంతుల్లో 85; 6×4, 6×6) అద్భుత ఇన్నింగ్స్ తో జట్టును గెలుపు బాటలో నిలపగా, కేఎల్ రాహుల్ (8), శ్రేయాస్ అయ్యర్ (24) మరో 26 బంతులు మిగిలుండగానే మ్యాచ్ ను ఫినిష్ చేశారు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 31 పరుగులతో రాణించాడు.

మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. కాగా, టీమిండియా ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టి20 మ్యాచ్ నవంబరు 10న నాగ్ పూర్‌లో జరగనుంది.

ఈ మ్యాచ్ తో రోహిత్ వంద అంతర్జాతీయ టి20 ఆడిన రెండో ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మొదటి ఆటగాడిగా పాకిస్థాన్ కు చెందిన షోయబ్‌ మాలిక్‌ (111) ఉన్నాడు.

rohith

స్కోరు వివరాలు..

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: లిటన్‌ దాస్‌ రనౌట్‌ 29, నయీమ్‌ (సి) శ్రేయస్‌ (బి) సుందర్‌ 36; సౌమ్య సర్కార్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) చహల్‌ 30; ముష్ఫికర్‌ (సి) కృనాల్‌ (బి) చహల్‌ 4; మహ్ముదుల్లా (సి) దూబే (బి) చహర్‌ 30; అఫీఫ్‌ (సి) రోహిత్‌ (బి) ఖలీల్‌ 6; మొసద్దిక్‌ నాటౌట్‌ 7; ఇస్లామ్‌ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 6, మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు)153.
వికెట్ల పతనం: 1–60, 2–83, 3–97, 4–103, 5–128, 6–142.
బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–25–1, ఖలీల్‌ 4–0–44–1, సుందర్‌ 4–0–25–1, చహల్‌ 4–0–28–2, దూబే 2–0–12–0, కృనాల్‌ 2–0–17–0.

భారత్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ శర్మ (సి) (సబ్‌) మిథున్‌ (బి) అమినుల్‌ ఇస్లామ్‌ 85; శిఖర్‌ ధావన్‌ (బి) అమినుల్‌ ఇస్లామ్‌ 31; రాహుల్‌ నాటౌట్‌ 8; శ్రేయస్‌ అయ్యర్‌ నాటౌట్‌ 24; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (15.4 ఓవర్లలో 2 వికెట్లకు) 154.
వికెట్ల పతనం: 1–118, 2–125.
బౌలింగ్‌: ముస్తఫిజుర్‌ 3.4–0–35–0, షఫియుల్‌ ఇస్లామ్‌ 2–0–23–0, అల్‌ అమిన్‌ 4–0–32–0, అమినుల్‌ ఇస్లామ్‌ 4–0–29–2, అఫీఫ్‌ 1–0–13–0, మొసద్దిక్‌ హుస్సేన్‌ 1–0–21–0.

- Advertisement -