షాకింగ్.. రష్మికకు ముద్దు పెట్టి అభిమాని..!

557
Rashmika Mandanna
- Advertisement -

హీరోయిన్‌ రష్మిక మందన్నకు ఓ అభిమాని షాకిచ్చాడు. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన రష్మికను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆమెతో సెల్ఫీ తీసుకోడానికి రిక్వెస్ట్ చేశారు. అయితే అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేని రష్మిక వారితో సెల్ఫీలు దిగింది. ఈ క్రమంలో ఓ అభిమాని ఆమెతో సెల్ఫీ దిగి ఆ వెంటనే ముద్దు పెట్టి పరారయ్యాడు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ తిన్నారు.

ఇక ఆ అభిమాని రష్మికకు ముద్దుపెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు వైరల్‌గా మారింది. వెంటనే స్పందించిన రష్మిక ఈవెంట్‌ మేనేజ్మెంట్‌పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు ఆ వీడియోను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ‘చలో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక.. ‘సరిలేరు నీకెవ్వరు’తో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా ఆమె నటించిన ‘భీష్మ’ సినిమా ఈ నెల 21న రిలీజ్‌ కాబోతోంది.

- Advertisement -