డేటింగ్‌పై స్పందించిన రష్మికా..!

120
rashmika
- Advertisement -

తన అందం,నటనతో టాలీవుడ్,కోలీవుడ్‌లలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్నా. తన క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో అగ్రహీరోలతో నటిస్తూ మెప్పిస్తున్న రష్మికా…ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో పాటు బాలీవుడ్ చిత్రాల్లో నటించి మెప్పిస్తోంది.

ఇటీవల ఓ షోలో పాల్గొన్న రష్మిక తరచుగా విజయ్ దేవరకొండతో ప్రేమాయణం అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని చెప్పింది. ఇక తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్ చేస్తావా? అని ఎదురైనా ప్రశ్నకు రష్మిక స్పందిస్తూ వయస్సు కంటే ఎక్కువ, ఇది వ్యక్తికి సంబంధించినది. వారు తమ గురించి ఆలోచించేలా చేస్తారు అని బదులిచ్చింది.

ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ “పుష్ప”లో రష్మిక శ్రీవల్లిగా కనిపించనుంది. ఈ చిత్రం డిసెంబర్ 17న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి హిందీతో సహా పలు భాషలలో విడుదల కానుంది. మరోవైపు ఆమె బాలీవుడ్ ఎంట్రీ మూవీ “మిషన్ మజ్ను” కూడా విడుదలకు సిద్ధమైంది.

- Advertisement -