అందులో తప్పేముంది..అందిరిలాగే నేను చేశాః రష్మీక మందన

377
Rashmika
- Advertisement -

రష్మీక మందన ఛలో సినిమాలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది. తన అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. రష్మీకకు యూత్ లో చాలా ఫాలోయింగ్ ఉంది. కన్నడ, తెలుగు, తమిళ్ లో ఆమెకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ప్రస్తుతం అమ్మడు చేతిలో ఒక అరడజను సినిమాలు ఉన్నాయి. ఆమె నటించిన డియర్ కామ్రేడ్ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక రష్మీక ప్రస్తుతం మహేశ్ బాబుతో సరిలేరు నీకెవ్వరు లో నటిస్తుంది. దాంతో పాటు నితిన్ భీష్మలో కూడా నటిస్తోంది. ఇంకా కన్నడలో మరో రెండు సినిమాలకు గ్రీన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఇక తాజాగా రష్మీకకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేశ్ బాబుతో ఆఫర్ రాగానే రష్మీక తన రెమ్యూనరేషన్ ను పెంచేసిందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందించింది రష్మీక. నటీనటులంతా కెరీర్ లో ఏదో ఒక సమయంలో ఎదుగుదల కోరుకుంటారు. నేను కూడా అదే చేస్తున్నా. అందులో తప్పేముంది అని తన నిర్ణయాన్ని రష్మిక సమర్థించుకుంది.

- Advertisement -