తిరుమలలో వీఐపీ దర్శనాలకు బ్రేక్‌…ఇకపై ఏడాదికి ఒకేసారి

482
Thirupathi
- Advertisement -

తిరుమల తిరుపతి వెంకన్న వీఐపీ దర్శనం విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. వీఐపి దర్శనాలను రద్దు చేయాలని భావిస్తున్నారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. వీఐపీల తాకిడి వల్ల సామాన్య భక్తులను ఇబ్బంది ఏర్పడుతుందని భావించిన ప్రభుత్వం ఇకపై వీఐపీల దర్శనానికి బ్రేక్ వేయనుంది. దీనిపై ప్రక్షాళన చేపట్టనున్నారు టీటీడీ చైర్మన్‌. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వీవీఐపీలకు ప్రత్యేక దర్శన సదుపాయం ఉంటుంది. ఆ తర్వాత వీఐపీలకు, కాస్త పలుకుబడి ఉన్నవారు ఎల్‌ 1, ఎల్‌ 2, ఎల్‌ 3 బ్రేక్‌ దర్శనాల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటారు.

ఇప్పుడీ స్పెషల్‌ దర్శనాలకు బ్రేక్‌ పడనుంది. వీఐపీలకు ఏడాదికి ఒక్క సారి మాత్రమే దర్శనం చేసుకుంటే బాగుంటుందని తెలిపారు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. ఎల్‌ 1, ఎల్‌ 2 దర్శనాలు రద్దుచేయాలంటూ ఇప్పటికే ఏపీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై ప్రభుత్వానికి, టీటీడీకి నోటిసులిచ్చింది కోర్టు. టీటీడీ తాజా నిర్ణయంతో శ్రీవారి ముందు వీఐపీల హవాకు బ్రేక్‌ పడనుంది. ఇకపై సామాన్యులకు తిరుమల వెంకన్న దర్శనం మరింత సులువుగా కానుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -