- Advertisement -
రష్మీ గౌతమ్…బుల్లితెర,వెండితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ముఖ్యంగా జబర్దస్త్‌లో యాంకరింగ్ ద్వారా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న రష్మీ…వెండితెరపై తన అందాల ఆరబోతతో అంతకుమించి ఇమేజ్ సంపాదించుకుంది.
తాజాగా వెబ్ సిరీస్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రష్మీ. టాలీవుడ్,బాలీవుడ్ స్టార్లు అంతా ఇప్పుడు వెబ్ సిరీస్‌పై చూస్తుండటంతో రష్మీ కూడా ఈ జాబితాలో చేరిపోయింది. ఈ వెబ్ సిరీస్‌లో రష్మి చాలా బోల్డ్‌గా ,లెస్బియన్‌గా నటించనుందట.
ఇప్పటివరకు 20కి పైగా సినిమాల్లో నటించిన రష్మీకి పెద్దగా అవకాశాలు కలిసిరాలేదు. అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తోంది. మరీ ఈ వెబ్ సిరీస్‌తో రష్మి ఏ విధంగా మెప్పిస్తుందో వేచిచూడాలి.
- Advertisement -