జూబ్లీహిల్స్‌ హుక్కా కేఫ్‌పై పోలీసుల దాడి

292
hyderabad

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 1లో టైం కేఫ్ పై జూబ్లీహిల్స్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ టైం కేఫ్ లో హుక్కా సేవిస్తున్న 25 మందిని గుర్తించారు. నిర్వాహకుడు జీషాన్ తో పాటు ముగ్గురు నిర్వాహకులను 12 మంది సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

జీషాన్ పై గతంలోనూ అనేక కేసులు నమోదై ఉన్నాయి… పోలీసులు ఎన్ని సార్లు కేసులు నమోదు చేసినా పద్ధతి మార్చుకోకుండా గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నాడు… ఇంటి యజమానికి నోటీసులు ఇవ్వాలని నిర్ణయించుకున్న పోలీసులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. హుక్కా కేంద్రంలోని సమగ్రినంతా సీజ్ చేశారు.

hyderabad police hyderabad police