వెబ్‌ సిరీస్‌ల బాటపట్టిన హీరోయిన్లు..!

515
web series

ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా నడుస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్‌స్టార్, జీ5 వంటి ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలు వెబ్ సిరీస్‌లను నిర్మిస్తుండటంతో టాలీవుడ్,బాలీవుడ్‌కు చెందిన స్టార్లు ముందుకొస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్‌కు చెందిన రాధిక ఆప్టే,కియారా అద్వానీ,త్రిదా చౌదరి,దియా మీర్జా వెబ్ సిరీస్‌లలో నటించి మెప్పించారు. ఇక టాలీవుడ్‌కు చెందిన కాజల్,సమంత,నిహారిక కొణిదెల,తేజస్వి సైతం వెబ్‌ సిరీస్‌లో నటిస్తున్నారు.

ఇక తాజాగా టాలీవుడ్ బ్యూటీ ఈషా రెబ్బా సైతం నెట్ ఫ్లిక్స్‌ వెబ్ సిరీస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్‌లో అందాల ఆరబోతతో కనువిందు చేయనుందట ఈషా. ఇక హాట్ యాంకర్ రష్మి సైతం వెబ్ సిరీస్ బాటపట్టింది. శేఖర్ సూఇ దర్శకత్వంలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్‌లో తన అందాలతో యూత్ మతిపొగొట్టనుందట రష్మి.

ఇప్పటివరకు తమ అందచందాలతో వెండితెరపై అలరించిన హీరోయిన్లు ట్రెండ్‌కి తగ్గట్లుగా మారుతూ అభిమానులకు దగ్గరవుతున్నారు. ఇక వీరిబాటలోనే మరికొంతమంది స్టార్ హీరోయిన్లు సైతం నడిచేందుకు సిద్ధమవుతున్నారు.