బాలయ్య సరసన యాంకర్ రష్మీ..!

441

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ‘రూలర్’ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్ ఈ నెల 8న రీలీజై మంచి అంచనాలు క్రియేట్ చేసింది. మూవీని డిసెంబర్ 20 న విడుదల చెయ్యాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కాగా బాలయ్య-బోయపాటి ఇటీవల తమ కాంబోలో మూడో మూవీని లాంఛనంగా స్టార్ట్ చేశారు. గతంలో వీరిద్దరూ ‘సింహా’, ‘లెజెండ్‌’ లాంటి బ్లాక్ బాస్టర్లను అందించారు. త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోనుంది.

balaya

అయితే ఇందులో బాలయ్య సరసన ఓ నాయికగా బుల్లితెర యాంకర్ రష్మీని తీసుకుంటున్నట్టు సమాచారం. ఇది గ్లామర్‌తో కూడిన ప్రత్యేక పాత్ర అని తెలుస్తోంది. ఈ పాత్ర కోసం..బోయపాటి రష్మీని అప్రోచ్ అయ్యారట. దానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.