చిన్ననాటి ఫొటోలు పోస్టు చేసిన మంత్రి కేటీఆర్..

329
ktr

నిత్యం ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండే మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. నిత్యం ట్విట్టర్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండడమే కాదు, అరుదైన ఫొటోలు షేర్ చేస్తుంటారు.

తాజాగా, తన తాతయ్య (అమ్మ తరఫు) ఫొటో పోస్టు చేశారు. “ఈ ఫొటో చూశారా… మా తాతయ్య స్వర్గీయ జె.కేశవరావు. ఆయనో స్వాతంత్ర్య సమరయోధుడు. అనేక పర్యాయాలు జైలుకెళ్లొచ్చారు. ఆయన పట్ల నేనెంతో గర్విస్తుంటాను” అంటూ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

బాల్యంలో తన సోదరి కవితతో పాటు.. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.