ఐపీఎల్ 11లో భాగంగా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్‌లో సన్ రైజర్స్ ఘనవిజయం సాధించింది. తక్కువ స్కోరు చేసినా ముంబైపై ఘనవిజయం సాధించిన సన్ రైజర్స్…పంజాబ్‌తో మ్యాచ్‌లోనూ అద్భుతం చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 13 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను ఓడించింది.
133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు గేల్,కేఎల్ రాహుల్ మంచి శుభారంభాన్ని అందించారు. రాహుల్ (32; 26 బంతుల్లో 4×4, 1×6), క్రిస్ గేల్ (23; 22 బంతుల్లో 1×4, 2×6) తొలి వికెట్‌కు 55 పరుగులు జోడించి పంజాబ్‌కు శుభారంభం అందించారు. ఈ దశలో లెగ్ స్పిన్నర్ రషీద్ (3/19) వికెట్ల వేటకు శ్రీకారం చుట్టగా.. షకిబ్ (2/18), సందీప్‌శర్మ (2/17), బాసిల్ థంపి (2/14) తలా ఓ చేయి వేశారు.
ఓ దశలో పంజాబ్ విజయానికి 47 బంతుల్లో 56 పరుగులు కావాలి. చేతిలో 7 వికెట్లున్నాయి. గెలుపు పంజాబ్‌దే అనుకున్నారంతా కానీ ఒక్కసారిగా సీన్ రివర్సైంది. గోరంత లక్ష్యం సైతం కొండంతగా మారిపోయింది.దీంతో పంజాబ్ 19.2 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది.
అంతకముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 132 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే కెప్టెన్ విలియమ్సన్ (0).. మూడో ఓవర్లో ధావన్ (11).. ఐదో ఓవర్లో సాహా (6) వికెట్లను కోల్పోయింది. 27 పరుగులకే 3 వికెట్లు పడ్డాయి. గత మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై 118 పరుగులు చేసిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో వంద దాడటమూ అనుమానంగానే కనిపించింది.మనీష్ పాండే (54; 51 బంతుల్లో 3×4, 1×6) అర్ధసెంచరీ చేయడంతో సన్‌రైజర్స్ 132 స్కోరైనా చేయగలిగింది.