కరోనా…సన్‌రైజర్స్ భారీ విరాళం

231
sun risers hyderabad

కరోనాపై పోరులో భాగంగా తమవంతు సాయాన్ని ప్రకటించింది సన్ రైజర్స్ హైదరాబాద్. రూ. 10 కోట్ల విరాళాన్ని ట్విట్టర్ వేదికగా అనౌన్స్ చేసింది. అయితే ఈ నిధిని సీఎం సహాయనిధికి ఇస్తారా పీఎం కేర్స్‌కు ప్రకటించారో మాత్రం తెలపలేదు.

సన్ రైజర్స్ భారీ విరాళాన్ని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశాడు ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌. సన్‌టీవీ గ్రూప్‌ మంచి పనికి నడుం బిగించడం హర్షణీయమని పేర్కొన్నాడు.