వార్నర్‌కు ఎస్‌ఆర్‌హెచ్‌ ఆసక్తికర ట్వీట్..

64
srh

ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మెన్,సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్‌ డేవిడ్ వార్నర్‌పై ఆ ఫ్రాంచైజీ ఆసక్తికర ట్వీట్ చేసింది.ఇటీవల ఐపీఎల్ వేలం జరుగగా ఓ నెటిజన్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ టామ్‌ మూడీని ఉద్దేశించి… ‘‘ఈసారి వేలంలో మంచి టీమ్‌ను ఎంచుకుంటారా టామ్‌’’అని ప్రశ్నించాడు.దీనికి స్పందించిన వార్నర్‌… ‘‘అనుమానమే’’ అంటూ కామెంట్‌ చేశాడు.

వార్నర్ ట్వీట్‌కు బదులిచ్చిన హైదరాబాద్ మేనేజ్‌మెంట్.. యాషెష్‌ సిరీస్‌ గెలిచినందుకు కంగ్రాట్స్‌ డేవీ… మంచి ఫామ్‌లోకి వచ్చావు కదా… విజయం తర్వాత పార్టీ చేసుకుని ఉంటావు! మరో విషయం.. మెగా వేలంలో నువ్వు మంచి ధర పలుకుతావులే అని పేర్కొంది.