ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది రాశిఖన్న. తన ఫస్ట్ సినిమాతోనే తన అందాలతో యూత్ ని ఫిదా చేసేసింది. ఇక టాలీవుడ్ లో ఉన్న హాట్ భామల చెంత ఈ చిన్నది కూడా చేరుతుంది అనుకున్నారు ప్రేక్షకులు. కానీ అందరూ అనుకున్నంత రేంజ్ కి చేరలేకపోయింది రాశి. ఎందుకంటే…తన బాడీ షేప్సే ఈ అమ్మడుకి మైనస్ పాయింట్ గా మారాయి.
నిజానికి ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదగడానికి, అదే రేంజ్ లో అవకాశాలు రాకపోవడానికి కారణం రాశీ బొద్దుగా ఉండటమే. అయినా..ఈ అమ్మడు ఆఫర్లను దక్కించుకోవడంలో మాత్రం ఫాస్ట్ గానే ఉందని చెప్పాలి. అయితే ఇప్పుడు రాశి తన సిని కెరీర్ ని కొత్తగా స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటివరకూ బొద్దుగా కనిపించిన ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజిలా తయారైపోయి..హాట్ హాట్ బాడీ షేప్స్ తో హీట్ పుట్టిస్తోంది.
ఇప్పటివరకు బొద్దుగుమ్మగా పిలిపించుకున్న రాశి.. ఇప్పుడు హాట్ భామగా పిచ్చెక్కించడానికి రెడీ అయిపోయింది. ఏడాది నుంచే బాడీపై, ఫిట్నెస్ పై దృష్టి పెట్టి కాస్త తగ్గిందనే సంగతి తెలుసు కానీ.. ఏ స్థాయిలో తగ్గిందనే విషయంలో మాత్రం.. తాజాగా జరిగిన ఐఫా ఉత్సవంలో అందరికీ అర్ధమైంది.
ఐఫాలో డ్యాన్స్ పెర్ఫామెన్స్ చేసిన ఈ బ్యూటీ.. తన అందాలతో సిని పెద్దల దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ అమ్మడు తాను ఏ రేంజ్ లో తగ్గిందో.. ఏ స్థాయిలో స్టార్ మెటీరియల్ గా మారుతోందో చెప్పకనే చెప్పేసింది. ఇప్పటికే ఎన్టీఆర్ పక్కన లీడ్ హీరోయిన్ గా ఓ ఛాన్స్ దక్కించుకుంది రాశి. ఇక ఈ కటౌట్ చూశాక.. రాశి ఖన్నకు స్టార్ హీరోల నుంచి వరుసగా పిలుపులు రావడం ఖాయం అంటున్నారు. మొత్తాకి రాశిఖన్న తన బాడీ షేప్స్ ని తగ్గించి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్ ఇచ్చిందనే చెప్పాలి.