మిస్టర్‌ కోసం కదిలిన కాటమరాయుడు..

127
Pawan kalyan in Mister Movie Pramotion

ఇప్పుడు మెగా హీరోలు కొంచం కష్టపడాల్సిన సమయమే అనుకోవాలి.ఎందుకంటార  పవన్‌ కల్యాణ్‌,రామ్‌ చరణ్‌,వరుణ్‌ తేజ్‌ ఈ మెగాహీరోలకు సరైన విజయం అందుకోలేకపోతున్నారు.మరి రీసెంట్‌గా పవన్,రామ్‌ చరణ్‌లు విజయం అందుకున్నా అది వారికి సంతృప్తిని ఇవ్వలేకపోయిందనేఏ చేప్పుకోవాలి.ఇక ఇప్పుడు వరుణ్‌ తేజ్‌ వంతు ఉన్నట్ల అనింస్తుంది.లోఫర్‌ సినిమా  ఫ్లప్‌ కావడంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ మెగా హీరో  హిట్‌ సినిమా అందుకోవల్సిందే మరి. తాజాగా వరుణ్‌ తేజ్‌ మిస్టర్‌ సినిమాతో సందడి చేయడానికి రెఢీ అవుతున్నాడు.మరి ఈ సినిమా హిట్‌ కావడం కోసం మెగా ఫ్యామిలి రంగంలోకి దిగినట్టుంది.

Pawan kalyan in Mister ,ovie Pramotion

తాజాగా పవన్ కూడా వరుణ్ తేజ్‌ ‘మిస్టర్‌’ సినిమాకి ప్రమోషన్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హిట్ అవుసరమున్న హీరో ఎవరంటే అది వరుణ్ తేజ్ అనే చెప్పుకోవాలి. చివరికి అల్లు శిరీష్ కు కూడా మంచి సక్సెస్ ఉంది. ఇప్పటికే లోఫర్ సినిమాతో బాగా కోలుకోలేని దెబ్బతిన్న వరుణ్ తేజ్‌కు సంబంధించిన సినిమా మిస్టర్ మూవీ కచ్చితంగా హిట్ కావాల్సిందే. అలా అని ఇదేదో గ్రేట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనుకుంటే పొరపాటేనండోయ్. ఆగడు, బ్రూస్ లీ సినిమా వంటి ప్లాపుల తర్వాత శ్రీనువైట్ల రూపొందించిన సినిమా ఇది. దీనికోసమే మెగా కాంపౌండ్ హీరోలంతా తమ భుజాన వేసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగో అలా ఈ సినిమాను సక్సెస్ చేసి వరుణ్ కు ఓ మంచి హీట్ ను అందించే లక్షంగా పెట్టుకున్నారు.

కాగా, మిస్టర్ సినిమా ప్రచారం కోసం చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు అంతా సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరుగనుంది. ఈ వేడుకకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాదండోయ్.. ఈ సినిమా ట్రైలర్‌లో కూడా మెగాస్టార్ చిరంజి క్లిప్పింగ్స్ కూడా వాడుకునే ప్లాన్‌లో ఉన్నారట. రామ్ చరణ్ కూడా మిస్టర్ సినిమాకు ప్రమోషన్ ఇవ్వనున్నాడట. ఒక వేళ తాను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు హాజరైనా కాకపోయినా తనవంతు ప్రచారం చేయాలని రామ్ చరణ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.