బీజేపీకి మరో షాక్.. సీఎం కేసీఆర్‌తో రాపోలు భేటీ..

386
kcr
- Advertisement -

బీజేపీ నేత, ప‌ద్మ‌శాలి సంఘ నాయ‌కుడు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్క‌ర్ ఆదివారం ప్ర‌గ‌తి భ‌వ‌న్ లో ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావుతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను ఆయ‌న అభినందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్ర‌భుత్వం చేనేతపై జీఎస్టీ వేయ‌డం ప‌ట్ల ఆయ‌న తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

బీజేపీ పార్టీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నేత కుటుంబం నుంచి వ‌చ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భ‌రించ‌లేన‌ని, తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ లో చేరుతాన‌ని సీఎం కేసీఆర్ తో చెప్పారు. రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అద్భుతంగా ఉన్నాయ‌ని ఆనంద భాస్క‌ర్ కొనియాడారు. భారత రాష్ట్ర స‌మితి ద్వారా జాతీయ రాజ‌కీయాల్లో కేసీఆర్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

- Advertisement -