ట్రెండింగ్‌లో మెగా 154!

303
chiru
- Advertisement -

గాడ్‌ ఫాదర్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం మెగా154. ఈవర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా టైటిల్‌ని దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోని రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో చిరంజీవి చేతికి ఉంగరాల, మేడలో గొలుసు, బ్యాక్ యాంగిల్ లో బీడీ తాగుతూ ఊర మాస్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. చెప్పాలంటే వింటేజ్ చిరుని మళ్ళీ చూస్తున్నట్లు ఉంది. సోమవారం 11:07 నిమిషాలకు టైటిల్ టీజర్ రిలీజ్ కానుంది.

చిరు సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమాలో చిరంజీవి జాలర్ల నాయకుడిగా కనిపించబోతున్నారని టాక్‌. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

- Advertisement -