తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఝలక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ గుడ్ బై చెప్పారు. పార్టీకి ఎంత నిబద్దతతో పనిచేసినా నాపట్ల నిర్లక్ష్య వైఖరి తోనే వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
రాహుల్ నాయకత్వంలో పార్టీ ఎదిగే సూచనలు కనిపించటంలేదని చెప్పిన రాపోలు తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడికి పంపించారు.
ఏపార్టీలో చేరతాననే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎలక్షన్ కమిటీ సభ్యుడిగా ఉన్న నన్ను కావాలనే పక్కన పెడుతున్నారని ఆరోపించిన ఆయన పార్టీ కోసం సంస్థాగతగా కృషి చేశానని తెలిపారు.
ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండగా మాజీ మంత్రులు,టికెట్లు ఆశీంచి భంగపడ్డవారు కమలం గూటికి చేరుతున్నారు. రాపోలు బాటలోనే మరికొంతమంది నేతలు ఉన్నట్లు సమాచారం. మొత్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది వరుస షాక్‌లతో కాంగ్రెస్ నేతలు సతమతమవుతున్నారు.