హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డి చరిత్ర ఇదీ…

389
hazipur srinivas reddy

సీరియల్ రేపిస్టు శ్రీనివాస్‌ రెడ్డి అకృత్యాలతో హాజీపూర్‌ వణికిపోయింది. చూడటానికి అమాయకుడిగా తమ మధ్యే తిరిగిన యువకుడు ఇంతటి అఘాయిత్యానికి పాల్పడటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు హాజీపూర్ వాసులు.కీసరలో మెకానిక్‌గా పనిచేసే శ్రీనివాస్ రెడ్డి రాత్రి పూట ఇంటికి వచ్చి ఉదయం పూట వెళ్లేవాడని ఆయన గురించి తెలిసిన వారు చెబుతున్నారు.

గ్రామంలో తక్కువగా ఉండేవాడని..ఒకవేళ ఉన్నా ఒంటరిగా సంచరించే వాడని తెలిపారు.కొంతమంది చిన్నతనం నుండే శ్రీనివాస్ రెడ్డికి దొంగతనాలు చేసే అలవాటు ఉందని అయితే దొంగతనాలు చేసిన సమయంలో కుటుంబసభ్యులు శ్రీనివాస్ రెడ్డిని వారిస్తే పరిస్థితి మరోలా ఉండేదని చెబుతున్నారు.

ఊరికి ఎప్పుడైనా వస్తే ఒంటరిగా సంచరించేవాడని గ్రామస్థులు చెబుతున్నారు. …నిర్జన ప్రదేశాల్లో, అడవుల్లో శ్రీనివాస్ రెడ్డి ఒక్కడే తిరిగే అలవాటు ఉందని గ్రామస్తులు గుర్తు చేసుకొంటున్నారు.ఇటీవలె శ్రీనివాస్ రెడ్డి కుటుంబసభ్యులు భూమిని అమ్మడంతో దీనికి సంబంధించిన డబ్బు కూడా రావడంతో జల్సాలు చేసేవాడని చెబుతున్నారు.