హజీపూర్ రేపిస్టుని పట్టించిన సీసీ టీవీ

282
hazipur rapist

సీరియల్ రేపిస్ట్, కిల్లర్ తమ మధ్యనే ఉన్నాడని తెలిసి భువనగిరి హజీపూర్ ప్రజలు వణికిపోయారు. నరహంతకుడి ఇంటిని కోపోద్రిక్తులై గ్రామస్తులు శ్రీనివాస రెడ్డి ఇంటిని తగులపెట్టారు. ఇన్ని అకృత్యాలకు పాల్పడిన నిందితుడిని చంపేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

పదో తరగతి విద్యార్ధిని శ్రావణి మిస్సింగ్ తో  మర్రి శ్రీనివాస్ రెడ్డి సీరియల్ హత్యలు వెలుగు చూశాయి. ఈ కేసు విచారణ చేసే సమయంలో గ్రామానికి సమీపంలోని సీసీ టీవీ పుటేజీలో శ్రావణిని శ్రీనివాస్ రెడ్డి తన బైక్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు చిక్కాయి. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నిందితుడు నిజాన్ని ఒప్పుకున్నాడు.

శ్రావణి మృతదేహాన్ని వెలుగుతీసే క్రమంలో ఆ ప్రాంతంలో తవ్వితే మనీషా అస్తిపంజరం లభ్యమైంది. దీంతో నాలుగేళ్ల క్రితం అదృశ్యమైన ఆరో తరగతి విద్యార్థిని కల్పన గురించి ప్రశ్నించగా ఆ చిన్నారిని కూడా చంపేసినట్లు శ్రీనివాస్‌ రెడ్డి అంగీకరించాడు. దీంతో మనీషా మృతదేహం దొరికిన బావిలోనే పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన బొమ్మలరామారం ఎస్ఐ‌ వెంకటేష్ పై పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటువేశారు.