మే 3న ‘గీతా .. ఛ‌లో’ గ్రాండ్ రిలీజ్‌..

279
- Advertisement -

ఛలో, గీత గోవిందం, దేవదాస్‌… ఇలా వరుస విజయాలతో తనకంటూ తెలుగులో మార్కెట్‌ను క్రియేట్‌ చేసుకున్నారు రష్మికా మంద‌న‌. వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక‌ నటించిన `గీతా.. ఛలో` మే3న విడుదలవుతోంది. దివాకర్‌ సమర్పణలో మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ నిర్మాత‌లుగా శ్రీ రాజేశ్వరి ఫిలింస్ -మూవీ మాక్స్‌ బ్యానర్లపై ఈ చిత్రం విడుదల‌వుతోంది. రిలీజ్ సంద‌ర్భంగా చిత్ర‌యూనిట్ హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌లో పాత్రికేయుల‌తో ముచ్చ‌టించింది.

నిర్మాత‌లు మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్ మాట్లాడుతూ – యువతరం మెచ్చే అన్ని హంగులు ఉన్న చిత్రమిది . వీకెండ్‌ పార్టీలు యువతకు మంచి చేస్తున్నాయా? చెడు చేస్తున్నాయా? అనే పాయింట్‌ చుట్టూ ఉన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుంది. కన్నడలో ఛమ్మక్‌ పేరుతో విడుదలైన ఈ చిత్రం దాదాపు 30 కోట్లు వసూలు చేసింది. మంచి చిత్రాన్ని అందరూ చూడాలనే వాయిదా వేసి మే 3న విడుదల చేస్తున్నాం. డ‌బ్బింగ్ సినిమా అయినా స్ట్రెయిట్ చిత్రంగా దీనిని ప్ర‌మోష‌న్ చేస్తున్నాం అని తెలిపారు.

Geetha Chalo Movie

నిర్మాత స‌త్యారెడ్డి మాట్లాడుతూ- భారీ క్రేజుతో వ‌స్తున్న ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించాలి. చ‌క్క‌ని కంటెంట్ ఉన్న చిత్ర‌మిది. నిర్మాత‌ల‌కు లాభాలు రావాలి అన్నారు.

రామ స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ -“సినిమా తీయ‌డ‌మే కాదు రిలీజ్ చేయ‌డంలో చ‌క్క‌ని ప్ర‌ణాళిక‌లు ఉండాలి. నిర్మాత‌లు పంపిణీ రంగంలో అనుభ‌వ‌జ్ఞులు. అవెంజ‌ర్స్ వ‌ల్ల వాయిదా వేసి స‌రైన టైమ్ లో రిలీజ్ చేస్తున్నారు“ అని అన్నారు.

సాయి వెంక‌ట్ మాట్లాడుతూ -మే 3న రిలీజ‌వుతున్న ఈ చిత్రం పెద్ద విజ‌యం సాధించాలి. ర‌ష్మిక క్రేజుకు త‌గ్గ‌ట్టే విజ‌యం ద‌క్కించుకుంటుంది. ఆల్ ది బెస్ట్ అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు దివాక‌ర్‌ మాట్లాడుతూ – గీత గోవిందంతో 100 కోట్ల క్ల‌బ్ నాయిక‌గా ర‌ష్మిక నిర్మాత‌ల బంగారు బాతులా మారారు. త‌ను నంబ‌ర్ వ‌న్ స్థాయిలో ఉన్నారు. గీతా ఛ‌లో పెద్ద విజ‌యం సాధిస్తుంది అన్నారు.

Geetha Chalo Movie

బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ- డ‌బ్బింగ్ సినిమాలు ఎన్నో వ‌స్తుంటాయి. అయితే అభిరుచితో తెచ్చే చిత్రాలు విజ‌యం సాధిస్తాయి. క‌న్న‌డ‌లో పెద్ద హిట్ట‌యిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు“ అన్నారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ- రెండు బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్స్ ని పెట్టుకుని వ‌స్తున్న చిత్ర‌మిది. అవెంజ‌ర్స్ లాంటి సునామీ ముందు రిలీజ్ చేయ‌కుండా వాయిదా వేయ‌డం మంచికే. మే 3న‌ ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ‌వుతోంది.. విజ‌యం సాధించాలి.. అన్నారు.

శోభా రాణి మాట్లాడుతూ – “మామిడాల శ్రీ‌నివాస్ చాలా కాలంగా ప‌రిశ్ర‌మ‌లో ఎంతో స‌న్నిహితులు. సినిమా విజ‌యానికి టైటిల్ ముఖ్య ం . గీత గోవిందం .. ఛ‌లో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్స్ ని క‌లిపి గీతా ఛ‌లో అనే టైటిల్ పెట్టారు. అంత పెద్ద హిట్ట‌వ్వాలి అన్నారు.

బాలాజీ నాగ‌లింగం.. స‌హా ప‌లువురు అతిధులు ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.

- Advertisement -