హైదరాబాద్ మొదటి మహిళా మేయర్‌… రాణి కుముదిని దేవి

33
hyderabad

రాణి కుముదిని దేవి వరంగల్ జిల్లాలోని వడ్డెపల్లిలో జనవరి 23, 1911 నాడు జన్మించారు.రాణి కుముదిని దేవి తండ్రి గారు పింగళి వెంకటరామారెడ్డి గారు నైజాం రాష్ట్రానికి ఉప ప్రధానమంత్రిగా పని చేశారు.హైదరాబాద్ సంస్తానం భారత యూనియన్లో విలీనమైన తరువాత వెంకటరామారెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు.

కుముదిని దేవి వనపర్తి సంస్తానానికి చెందిన జనుంపల్లి రాజారాందేవ్ రావు గారిని వివాహం చేసుకున్నారు.కుముదిని దేవి గారు నిజాం రాష్ట్రంలో వాహనం నడిపిన మొదటి మహిళగా మరియు హైదరాబాద్ తొలి మహిళా మేయర్ గా (1962 లో) ఏకగ్రీవంగా ఎన్నికై రికార్డు స్రుష్టించారు.కుముదిని దేవి 1962 నుంచి 1972 వరకు వనపర్తి శాసనసభ స్తానానికి ప్రాతినిద్యం వహించారు.

కుముదిని దేవి కుష్టు వ్యాది రోగుల కోసం శివానంద పునరావాస కేంద్రం అనే స్వచ్చంద సంస్థను యేర్పాటు చేసి ఎంతో మంది రోగులను ఆదుకున్నారు.కుముదిని దేవి గారు ఆగస్టు 6, 2009 నాడు 98వ యేట కన్నుమూశారు.