గ్రీన్ ఛాలెంజ్‌…మొక్కలు నాటిన సినీ ఆర్టిస్ట్ కుశాల్

143
koushal

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొక్కలు నాటారు సినీ ఆర్టిస్ట్ కుశల్. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా సినీ ఆర్టిస్ట్ కావ్యరెడ్డి ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి కొండాపూర్ చిత్రపురి కాలనీ తన నివాసం లో మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ మానవాళి మనుగడకు మొక్కలే కీలకం , అవి లేకుండా మనిషి మనుగడ కష్టం . కావున మనకు మంచి వాతావరణం కావాలన్న , పర్యావరవరణ పరిరక్షణ కోసం , ఎండా తీవ్రత తగ్గించడానికి మొక్కలు నాటి వాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు . ఈ కార్యక్రమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురి ఆర్టిస్టులు సహస్ర , లక్ష్మి , యువ కథానాయిక కారుణ్యకి ఛాలెంజ్ చేశారు.