ఎమ్మెల్యే బిగాల గణేష్‌కు పితృవియోగం..

27
ganesh

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి బిగాల కృష్ణ మూర్తి ఇవాళ ఉదయం బంజారాహిల్స్ స్టార్ హాస్పిటల్ లో అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే హాస్పిటల్ చేరుకొని శోకసంద్రమైన ఎమ్మెల్యే గణేష్ గుప్తాను, వారి కుటుంబ సభ్యులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,ఎమ్మెల్సీ కవిత ఓదార్చారు. కృష్ణమూర్తి భౌతిక కాయానికి ఇరువురు నివాళులు అర్పించి సంతాపం తెలిపారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు.