తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ప్రారంభించనున్నారు. చిన్నకోడూరు మండలంలోని చంద్లాపూర్ శివారులోని రంగనాయకసాగర్ పంప్‌హౌజ్‌లోని నాలుగుమోటర్లలో ఒక మోటర్ వెట్ రన్ ప్రారంభించనున్నారు. దీంతో సిద్దిపేట జిల్లాలోని బీడుభూములను గోదావరి జలాలతో తడుపాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన భగీరథ యజ్ఞం ఫలించినట్లవుతున్నది.
కాళేశ్వరం పది దశల ఎత్తిపోతలలో రంగనాయక సాగర్‌తో ఏడోదశ సంపూర్ణం కాబోతున్నది. వెట్ రన్ కు అన్ని ఏర్పాట్లు రంగనాయకసాగర్‌లోని నాలుగు మోటర్ల వెట్ రన్ సందర్భంగా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.
రంగనాయకసాగర్ నుంచి తుక్కాపూర్, అక్కారం, మర్కూక్ మీదుగా మరో మూడడుగులు వేస్తే గోదావరి బేసిన్‌లోనే అతి ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన కొండపోచమ్మను కాళేశ్వర జలాలు ముద్దాడుతాయి. కొండపోచమ్మసాగర్‌లోకి గోదావరిజలాలు అందుబాటులోకి వస్తే.. ప్రపంచంలోనే అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకంగా ఖ్యాతికెక్కిన కాళేశ్వరం.