సచిన్‌కు మంత్రి కేటీఆర్ బర్త్ డే విషెస్…

270
ktr
- Advertisement -

క్రికెట్‌ దేవుడిగా అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాధించుకున్నాడు సచిన్ టెండూల్కర్. అలుపెరుగని క్రికెట్‌ ప్రయాణంలో ఎన్నో అవార్డులు.. మరెన్నో రికార్డులు అందుకున్న సచిన్ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ తెలిపారు.

స‌చిన్‌తో క‌లిసి దిగిన ఫోటో షేర్ చేసిన కేటీఆర్.. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలి అని పేర్కొన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం క్రికెట్ గాడ్‌కి విషెస్ తెలిపారు. భారతదేశానికి గ‌ర్వ కార‌ణం వన్ అండ్ ఓన్లీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. మీరు రానున్న త‌రాల‌కి కూడా స్పూర్తిగా ఉంటారు అని పేర్కొన్నారు.

- Advertisement -