భవదీయుడు భగత్ సింగ్….అప్ డేట్

24
pawan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం భీమ్లానాయక్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న పవన్‌ తర్వాత హరీశ్‌ శంకర్‌తో భవదీయుడు భగత్ సింగ్‌తో సినిమా చేయనున్నారు.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాకి టైటిల్‌కి అభిమానుల నుంచి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ నుండి వస్తున్న అప్‌డేట్ ప్రకారం దసరా నుండి సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది.

ఇందులో పవన్ కళ్యాణ్ కాలేజ్ లెక్చరర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. పవన్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. గబ్బర్ సింగ్ సంచలన విజయం తర్వాత పవన్, హరీష్ కలయికలో రెండో సినిమా కావడంతో అంచనాలు రెట్టింపయ్యాయి.