టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి రంగమార్తాండ సినిమా భావోద్వేగానికి గురైనట్టు తెలిపారు. ఈ సినిమా చూస్తున్నంతసేపు అప్రయత్నంగానే కన్నీరు వచ్చేసింది అన్నారు. రంగమార్తండ సినిమా యూనిట్‌ను మెచ్చుకున్నారు. ఇలాంటి సినిమా ప్రస్తుత కాలంలో రావడం చాలా అరుదుగా ఉంటుదన్నారు.
ఇంకా..రంగమార్తాండ సినిమాను చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి సినిమా. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్న భావన కలుగుతుంది. కృష్ణవంశీ లాంటి ఓ క్రియేటివ్ దర్శకుడు, ప్రకాశ్‌రాజ్‌లాంటి జాతీయ నటుడు, హాస్య బ్రహ్మానందం పనితనం కలిసి ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. బ్రహ్మానందం లాంటి ఉద్విగ్నభరితమైన పాత్ర చేయడం బహుశా ఇదే తొలిసారి. సెకండాఫ్ మొత్తం కంటి నిండా కన్నీరు వచ్చేసింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ ప్రకాశ్‌రాజ్ బ్రహ్మానందం చిత్ర యూనిట్ మొత్తానికి నా అభినందనలు ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
మరాఠీలో సూపర్ హిట్‌గా నిలిచిన నటసామ్రాట్‌కు రీమేక్‌గా రంగమార్తాండ సినిమాను కృష్ణవంశీ తెరకెక్కించారు. ఈ సినిమాలో రాహుల్ సిప్లిగంజ్ శివాత్మిక అనసూయ తదితరులు కీలకపాత్రల్లో నటించారు.
Kudos to #Rangamarthanda 👏👏@director_kv @prakashraaj #Brahmanandam @meramyakrishnan pic.twitter.com/spjo5FZlWw
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2023
ఇవి కూడా చదవండి…